కరోనా కారణంగా స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ల వినియోగం బాగా పెరిగింది. ఓ వైపు స్కూల్స్, మరోవైపు ఆన్ లైన్ క్లాసులతో వెరసీ గాడ్జెట్స్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అభిరుచికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్‌ను విడుదల చేస్తున్నాయి. తాజాగా.. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్జజం ‘రియల్ మీ’ ఇండియాలో ‘రియల్ మీ స్లిమ్ బుక్’ పేరుతో తొలి ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేసింది.తక్కువ ధర, ఒకే సారి జామ్-ప్యాక్డ్ (ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేసి వినియోగించేలా) సామర్ధ్యం, ఖరీదైన కాంపోనెంట్స్(ల్యాప్ ట్యాప్‌లోని భాగాలు)తో హైట్ 3:2, 14 అంగుళాల స్క్రీన్, 2160*1440 ఫిక్సెల్, 2కే రెజెల్యూషన్‌తో ఆకట్టుకుంటుంది.
దీంతో పాటు ఇండియాలో డెల్ ఇన్ స్ప్రాన్, హెచ్‌పీ గేమిండ్, లెనోవో బీక్యూఐన్ లో వినియోగించే ఆమ్లోడ్ డిస్ ప్లే కాకుండా.. ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్స్, స్కెచ్ ఆర్టిస్ట్, గ్రాఫిక్స్ డిజైనర్స్ వినియోగించే ఎల్సీడీ( లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే) ఐపీఎస్ ప్యానల్ టెక్నాలజీ, 90శాతం స్క్రీన్ రేషియో, ఇంటెల్ 11జనరేషన్, కోర్ ఐ3, కోర్ ఐ5 ప్రాసెస్, 8జీబీ లో పవర్ డబుల్ డేటా రేట్ మెమెరీ, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ సౌకర్యం ఉండగా.. ఈ ల్యాప్ ట్యాప్ ప్రస్తుతం విండోస్ 10ను వినియోగించుకోవచ్చు. విండోస్ 11 విడుదలైతే ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
కనెక్టవిటీ కోసం సీ టైప్ 3.0 యూఎస్బీ పోర్ట్, టైప్ సీ యూఎస్బీ 4 థండర్ బోల్ట్ పోర్ట్, టైప్ ఏ యూఎస్బీ 3.0, హెడ్ ఫోన్ జాక్, వైఫై 6, స్టెరో స్పీకర్స్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 11గంటలు నిర్విరామంగా వినియోగించుకునేలా 54 డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 65డబ్ల్యూ యూఎస్బీ సీ టైప్ ఛార్జర్, 30డబ్ల్యూ డ్రార్ట్ ఛార్జ్, రియల్ మీ ఫోన్ సాయంతో ల్యాప్ ట్యాప్ తో పాటు డెస్కెట్యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు.ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఈ ల్యాప్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో వస్తుండగా.. 8జీబీ ర్యామ్ అండ్ 256 స్టోరేజ్‌తో ఉన్న ల్యాప్ ట్యాప్ ధర రూ.46,999 ఉండగా కోర్ ఐ3 మోడల్ ల్యాప్ ట్యాప్ 8జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ ఉన్న ల్యాప్ ట్యాప్ ధర రూ.59,999కే వస్తున్నట్లు రియల్ మీ ఇండియా తెలిపింది.