Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ గత మూడు నాలుగు నెలలుగా తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాను తెరకెక్కించేందుకు ఉరుకులు పరుగుల మీద ఏర్పాట్లు చేశాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం పది మందితో ఒక టీంను ఏర్పాటు చేయడంతో పాటు, నిర్మాణం కోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు ఫైనాన్సియర్స్‌ను కూడా సిద్దం చేశాడు. ఈ సమయంలోనే దర్శకుడు తేజ తప్పుకున్నాడు. అయినా పర్వాలేదు చివరకు నేను అయినా దర్శకత్వం చేసేస్తా అంటూ బాలకృష్ణ తన తండ్రి బయోపిక్కు ఏర్పాట్లు చేశాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా బాలయ్య తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌గా కాకుండా వినాయక్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టడం వెనుక కారణాలు ఏంటీ అని పలువురు పలు రకాలుగా విశ్లేషించారు. అయితే తాజాగా సినీ వర్గాల నుండి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ‘మహానటి’ విడుదలైన తర్వాత బాలయ్య తన నిర్ణయంను మార్చుకున్నాడని, ‘మహానటి’ విడుదలైన వెంటనే ఎన్టీఆర్ బయోపిక్‌ను విడుదల చేస్తే ప్రేక్షకులు ఒక రకమైన ఊహలో ఉండి ఎన్టీఆర్ సినిమాను తిరష్కరిస్తారనే భయంతో నందమూరి బాలకృష్ణ తన తండ్రి బయోపిక్‌ను పక్కకు పెట్టాడు. మహానటి చిత్రంలో సావిత్రి జీవితం గురించి ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. బయోపిక్ అంటే ఇలా ఉండాలని ప్రేక్షకులు మరియు విమర్శకులు అంతా అంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను చేయడం, దాంట్లో బాలయ్య కాస్త మసాలా దట్టించి, కల్పిత సీన్స్‌ను కూడా యాడ్ చేయాలనుకున్నాడు. అలా చేస్తే సినిమా సక్సెస్ కాకపోవగా, పరువు పోతుందని భయపడ్డాడు. దాంతో ప్రస్తుతానికి మహానటి వల్ల ‘ఎన్టీఆర్’ను పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది.