సాటి తెలుగోడిని కేసీఆర్ మోసం చేసింది అందుకేనా ?

Reason behind TRS not to support no-confidence motion

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హైనాద్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెప్పుకొచ్చారు. అయితే, కేసీఆర్ వైఖరి ఇప్పుడు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఈ విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే చెందినవి కాదు. తెలంగాణకు రావాల్సినవి చేయాల్సినవి ఏవీ ఇవ్వలేదు. వాస్తవానికి ఏపీకి ఇచ్చిన వాటిలో కనీసం ఓ పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వలేదు.

మరి కేసీఆర్‌ ఎందుకు అవిశ్వాసానికి మేము దూరం అంటున్నారు ? అలాగే బీజేపీతో కుమ్మక్కయ్యారని ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసి కూడా ఎందుకు .. బీజేపీకి పరోక్ష మద్దతు తెలుపుతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం అయ్యి, మోడీని ఎదుర్కుంటుటే, కెసిఆర్ మాత్రం మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్ద రోజుల కిందట తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో తమ పోరాటానికి మద్దతివ్వాలంటూ కేసీఆర్‌ను కలుసుకోవాలనుకున్నారు. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకపోవడంతో రాజ్యసభ సభ్యుడు కేకేతో సమావేశమయ్యారు. కేకే కూడా విభజన హామీలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ కూడా నష్టపోతుందని టీడీపీకి అన్ని విధాలుగా మద్దతిస్తామన్నారు. కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని లైట్ తీసుకుని పక్కకొచ్చేసారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొంటామని తమ రాష్ట్ర విభజన హామీలపై తమ వాణి వినిపిస్తామంటున్నారు.. మొత్తానికి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పటికయినా దిద్దుబాటు చర్యలు ప్రారంభిస్తే ఆ తీవ్రత తగ్గే అవకాశం ఉంది.