బాలయ్యకు సర్జరీ.. అసలేం జరిగిందంటే!

Reason Behing Balakrishna Surgery
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ గత కొన్నాళ్లుగా బుజం నొప్పితో బాధపడుతున్నారు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో బాలకృష్ణ గాయపడ్డారు. ఆ చిత్రంలో ఒక ఫైట్‌ సన్నివేశంలో బాలకృష్ణ డూప్‌తో చేద్దామని చెప్పినా వినకుండా సొంతంగానే చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో బుజంకు గాయం అయ్యింది. ఆ గాయంతోనే ఇన్ని రోజులుగా బాలయ్య షూటింగ్స్‌ చేస్తూ వస్తున్నాడు. జైసింహా చిత్రం ముందే కమిట్‌ అయిన కారణంగా సినిమాను వాయిదా వేసే పరిస్థితి లేక అదే నొప్పితో షూటింగ్‌ను కంటిన్యూ చేయడం జరిగింది. బాలకృష్ణ నటించిన జైసింహా చిత్రం ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం బాలయ్య తన తండ్రి జీవిత చరిత్రతో ‘ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌కు సమయం పట్టనుంది. 

ఇదే సమయంలో తన బుజం నొప్పికి సర్జరీ చేయించుకోవాలని భావిస్తున్నాడు. అమెరికాలో త్వరలో బాలయ్య సర్జరీ చేయించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సర్జరీ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే సర్జరీ అయిన తర్వాత బాలయ్య కొన్ని నెలల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ స్క్రిప్ట్‌ను పూర్తి చేయించాలని భావిస్తున్నాడు. తన తండ్రి జీవిత చరిత్రపై ఇంకా రీసెర్చ్‌ చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సమయం పడుతుందని, ఆగస్టులో సినిమాను మొదలు పెడతామని చెప్పిన బాలకృష్ణ ఈ గ్యాప్‌లో సర్జరీ చేయించుకుని బుజం నొప్పికి ఫుల్‌ స్టాప్‌ పెట్టుకోవాలని భావిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్‌ ప్రారంభించిన తర్వాత ఇంత గ్యాప్‌ ఎప్పుడు రాలేదు. మొదటి సారి ఇంత గ్యాప్‌ తీసుకోబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.