తడిజుట్టు టవల్తో తుడుస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

మనలో చాలా మంది, ముఖ్యంగా స్త్రీలు తల స్నానం చేసాక తడి జుట్టు ఆరబెట్టుకోడానికి టవల్ ను తలకు(జుట్టుకు) కట్టుకుంటారు. అయితే మీకీ విషయం తెలుసా ఇలా చేయడం వల్ల జుట్టు విషయంలో భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే, ప్రతిసారి ఫైబ్రిక్ లేదా టర్కీ టవల్ ను వాడటం వలన జుట్టు(వెంట్రుకల)కొనలు తెగటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నీటిలో నానిన జుట్టు తెగిపోవటానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కఠినంగా, పొడిగా ఉండే టవల్ లేదా టర్కీ టవల్ తో జుట్టు లాగటం వలన మృదువుగా ఉండే వెంట్రుకల బయటిపొర ప్రమదానికి గురై జుట్టు రాలిపోతుంది. అయితే టర్కీ టవల్ కంటే కూడా లేదా మైక్రోఫైబర్ టవల్ లను వాడండి. ఈ మైక్రోఫైబర్ టవల్ లు కృత్రిమ ఫైబర్ ల నుండి తయారు చేస్తారు మరియు ఇవి నీటిని త్వరగా జుట్టు నుండి లాగివేస్తాయి.

ఇలా తడి జుట్టు నుండి నీరు వేరు చేయటం వలన కొద్ది సమయంలోనే గాలికి జుట్టు ఆరుతుంది. లేదా మీ జుట్టును గాలి సహాయంతో ఆరబెట్టాటినికి ముందు మృదువైన T-షర్ట్ తో తుడవండి. వీటన్నిటికంటే జుట్టును ఆరబెట్టే ఉత్తమ పద్దతి సహజంగా గాలి ద్వారా ఆరబెట్టడం. కొంత మంది జుట్టును ఆరబెట్టడానికి కృత్రిమ హెయిర్ డ్రయర్ లను వాడతారు. వీటి వలన జుట్టు ఆరోగ్యం ప్రమాదనికే గురవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. స్నానం చేసిన తరువాత, మృదువుగా ఉండే టవల్ లేదా T-షర్ట్ ను జుట్టుపై కప్పండి, ఇలానే కొద్ది సమయం పాటూ ఉంచటం వలన సహజంగానే జుట్టు ఆరిపోతుంది. కానీ, ఈ పద్దతికి అనుసరించుటకు ఎక్కువ సమయం పట్టినప్పటికీ, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు.మీ జుట్టుకు సరిపోయే షాంపూ మరియు కండిషనర్ ను వాడటం మీ జుట్టుకి మంచిది. చూసారుగా మీ జుట్టు మీద ప్రేమ ఉంటె ఇప్పటికైనా జాగ్రత్త పడండి.