ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో తీవ్ర బీభత్సం

ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో తీవ్ర బీభత్సం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో తిరుగుబాటుదారులు తీవ్ర బీభత్సం సృష్టించారు. తిరుగుబాటుదారుల దాడిలో 30 మంది మృతి చెందారు. అందులో 28 మంది స్థానిక పౌరులు, ఇద్దరు సైనికులు ఉన్నారని అధికారులు ప్రకటించారు. రాజధాని బాంగూయ్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో కామెరూన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కైటా, బేయెన్‌గౌ గ్రామాల్లో తిరుగుబాటుదారులు ఆదివారం ఏకకాలంలో దాడులకు తెగపడ్డారు.

దాడులు జరుగుతున్న సమయంలో పలువురు కామెరూన్‌కు పారిపోయారని అధికారులు వెల్లడించారు. 2013లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో తిరుగుబాటుదారుల అంతర్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా వివాదం సద్దుమణిగినప్పటికీ చాలా భూభాగం తిరుగుబాటుదారుల చేతుల్తోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.