ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. గత 24 గంటల్లో 10,730 మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో 33 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 9 చొప్పున, కృష్ణా జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జల్లా నుంచి ఒక కరోనా కేసు నమోదైంది.(అవన్నీ తప్పుడు రిపోర్ట్స్‌; వారికి కరోనా‌ సోకలేదు)

కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లా నుంచి ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 46కు చేరింది. అందులో కృష్ణా నుంచి ఇద్దరు, కర్నూల్‌ నుంచి ఒకరు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58 మంది డిశ్చార్జ్‌ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1056కి చేరింది. డిశ్చార్జి అయిన వారిలో కృష్ణా జిల్లా నుంచి 35 మంది, అనంతపురం నుంచి ముగ్గురు, కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 949 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.