విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కతుతున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకొని మూవీ రిలీజ్‌కు ముందే లైగర్ డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.60కోట్లకు సొంతం చేసుకుందట. ఇదే నిజమైతే విజయ్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదరిన డీల్ ఇదేనని చెప్పొచ్చు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇక దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.