2024లో మహేష్ బాబు సినిమాకు రికార్డు టీఆర్పీ!

"Record TRP for Mahesh Babu's movie in 2024!"'
"Record TRP for Mahesh Babu's movie in 2024!"'

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గత మూవీ ల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ “సరిలేరు నీకెవ్వరు” కూడా ఒకటి. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ క్లాష్ ఉన్నపటికీ రికార్డ్ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. అయితే ఈ మూవీ బిగ్ స్క్రీన్స్ మీదే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ మూవీ టెలికాస్ట్ అయ్యిన ప్రతీసారి కూడా సాలిడ్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వస్తూనే ఉన్నది .

అలా ఈ ఏడాదిలో మన తెలుగు బుల్లితెర దగ్గర రికార్డ్ టీఆర్పీ ఇప్పటికే ఎన్నోసార్లు టెలికాస్ట్ అయిన మూవీ ల్లో అందుకున్నట్టు తెలుస్తుంది . ఈసారి 7.01 రేటింగ్ రాబట్టినట్టు తెలుస్తుంది . ఇది మాత్రం ఈ ఏడాదిలో రికార్డ్ అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అయితే మహేష్ బాబు మూవీ లకి స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో దీనితో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని అనీల్ సుంకర నిర్మాణం వహించారు.