స్మ‌గ్ల‌ర్ సంగీత ఆత్మ‌హ‌త్యా య‌త్నం

red-sanders-smuggler-sangeeta-chatterjee-attempts-suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చిత్తూరు స‌బ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న లేడీ డాన్ సంగీత ఛ‌ట‌ర్జీ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. బెయిల్ రావ‌టం లేద‌న్న తీవ్ర నిస్పృహ‌తో విష‌గుళిక‌లు తిని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన సంగీత ఛ‌ట‌ర్జీని జైలు సిబ్బంది హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి త‌ప్పించారు. కోల్ క‌తాకు చెందిన మోడ‌ల్ అయిన సంగీతా ఛ‌టర్జీ పై నాలుగు ఎర్ర‌చంద‌నం కేసులు ఉన్నాయి. ప్ర‌ముఖ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ ల‌క్ష్మ‌ణ్ దంగే స‌న్నిహితురాలైన సంగీత ను గ‌త ఏడాది చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ల‌క్ష్మ‌ణ్ దంగె అరెస్టు త‌ర్వాత పోలీసుల విచార‌ణ‌లో సంగీత పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆమెను అరెస్ట్ చేసేందుకు కోల్ క‌తాకు వెళ్లిన చిత్తూరు పోలీసుల‌కు ఆమె షాకిచ్చారు. పెద్ద సంఖ్య‌లో లాయ‌ర్లు త‌ర‌లివ‌చ్చి సంగీత‌కు అప్ప‌టిక‌ప్పుడు ముంద‌స్తు బెయిల్ ఇప్పించ‌టంతో ఆమె త‌ప్పించుకున్నారు. దీంతో ఖంగుతిన్న చిత్తూరు పోలీసులు…గ‌త ఏడాది మ‌రిన్ని ఆధారాల‌తో ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌తో వెళ్లి సంగీత‌ను అరెస్టు చేసి చిత్తూరు తీసుకువ‌చ్చారు. అప్ప‌టినుంచి ఆమె చిత్తూరు స‌బ్ జైలులోనే ఉంది. ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ప్రారంభించిన సంగీత త‌ర్వాత మోడ‌ల్ గానూ కొన‌సాగింది. ఆ క్ర‌మంలో స్మ‌గ్ల‌ర్ ల‌క్ష్మ‌ణ్ తో ప‌రిచ‌యం క‌లిగింది. ల‌క్ష్మ‌ణ్ తో పాటుగా సంగీత కూడా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కు పాల్ప‌డింది.

మరిన్ని వార్తలు:

రూ. 200 నోటు విడుద‌ల రేపే

మ‌రోసారి త‌మ పౌరుల‌కు అడ్వైజ‌రీ జారీ చేసిన చైనా