మళ్ళీ తగ్గిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు

Petrol Diesel Price In India

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గడం వరుసగా ఇది రెండో రోజు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతూ ఉండడంతో, దేశంలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. అలా అని రూపాయల్లో కాకుండా పైసల్లో తగ్గడమే విశేషం. ఈరోజు తగ్గిన ధరల ప్రకారం, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర పైన 15 పైసలు తగ్గి రూ. 80.98 గా, డీజిల్ ధర పైన 13 పైసలు తగ్గి రూ. 77.54 గా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.26 మరియు డీజిల్ ధర రూ. 76.39 లుగా ఉన్నాయి.

Petrol-And-Diesel-Prices
అలాగే దేశరాజధాని న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర పైన 14 పైసలు తగ్గి రూ.76.38 మరియు డీజిల్ ధర పైన 12 పైసలు తగ్గి రూ.71.27 గా కొనసాగుతున్నాయి. వాణిజ్యరాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర పైన 14 పైసలు తగ్గి రూ.81.90, డీజిల్ ధర పైన 13 పైసలు తగ్గి రూ. 74.66 గా నమోదయ్యాయి. ఇవేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ ధర 67.39 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 57.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇలా ధరలు తగ్గడం వినియోగదారునికి మంచి విషయం అయినప్పటికీ, పైసల్లోనే తగ్గుతుండడం కొంచెం నిరాశపరిచే అంశమే