పవన్‌ మూవీ.. ఆసక్తికరమైన విషయం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా అజ్ఞాతవాసి తర్వాత మరో సినిమాను చేయలేదు. కనీసం ఇన్నాళ్లు తర్వాత సినిమాకు కమిట్‌ కాలేదు. పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ సినిమాలపై దృష్టి పెట్టలేక పోతున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్‌ సినిమా ఉండదని అంతా భావించారు. 2019 ఎన్నికల తర్వాత పవన్‌ నటిస్తే నటించొచ్చు అంటూ కొందరు అన్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కొత్త సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. అయితే పవన్‌ ఎప్పటిలా రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా చేయబోవడం లేదు. మెగా హీరో సాయి దరమ్‌ తేజ్‌ హీరోగా రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కబోతున్న చిత్రంలో పవన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఒక మంచి కథను కూడా రామ్‌ తాళ్లూరి సిద్దం చేయించినట్లుగా తెలుస్తోంది.

పవన్‌ మూవీ.. ఆసక్తికరమైన విషయం - Telugu Bullet

పవన్‌ కళ్యాణ్‌ ఈ చిత్రంలో సెకండ్‌ హాఫ్‌లో మాత్రమే కనిపిస్తాడట. ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా తరహాలోనే ఉంటుంది. కాని పవన్‌ పాత్ర మాత్రం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కనిపిస్తాడని తెలుస్తోంది. సెకండ్‌ హాఫ్‌లో కథకు చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాడట. రాజకీయ మైలేజ్‌ పెంచే విధంగా ఈ చిత్రంలో పవన్‌ పాత్ర ఉంటుందని సమాచారం అందుతోంది. పవన్‌కు ఆప్త మిత్రుడు రామ్‌ తాళ్లూరికి ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ సినిమాతో వచ్చిన పారితోషికంను పార్టీ కార్యక్రమాలకు వినియోగించాలని పవన్‌ భావిస్తున్నాడట. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఒక వైపు చేస్తూనే మరో వైపు సినిమా కూడా చేయబోతున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ముందే ఈ చిత్రం విడుదల కాబోతుంది.