రెజీనా కసాండ్ర ‘బ్రేకింగ్‌ న్యూస్‌’

రెజీనా కసాండ్ర 'బ్రేకింగ్‌ న్యూస్‌'

హీరోయిన్‌ రెజీనా కసాండ్ర ‘బ్రేకింగ్‌ న్యూస్‌’తో ముందుకు రానుంది. సుబ్బ‌రాజు, జె.డి. చ‌క్ర‌వ‌ర్తిలతో కలిసి రెజీనా నటించిన సినిమా ‘బ్రేకింగ్ న్యూస్’.సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. తొలి షెడ్యూల్ షూటింగ్‌ డిసెంబ‌ర్ మూడో వారం వ‌ర‌కు కొనసాగుతుంది. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహిస్తామని మేకర్స్‌ తెలిపారు. వైవిధ్య‌మైన క‌థ‌నంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, ఈశ్వర్ ఎలుమహంతి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.