Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభిన్న చిత్రాలను చేస్తూ వరుసగా ఏడు చిత్రాలతో సక్సెస్‌లను అందుకున్న యువ హీరో నాని ప్రస్తుతం ‘ఎంసీఏ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. దిల్‌రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. ఒక వైపు హీరోగా ఎంతో బిజీగా ఉన్న నాని నిర్మాతగా కూడా తన ప్రస్థానంను మొదలు పెట్టాడు. నాని వాల్‌పోస్టర్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి అందులో మొదటి చిత్రంగా ‘అ!’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తెగ హల్ చల్ చేస్తోన్న ఆ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఇషా మరియు రెజీనాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఇటీవలే ఇషా లుక్‌ను రివీల్ చేశారు. ఇషా లుక్ ఆకట్టుకుంది. ఆమె మేకోవర్ మరియు ఇతర అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇషా లుక్ విడుదలైన కొన్ని గంటల్లోనే మరో హీరోయిన్ రెజీనా లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా చూడని విధంగా రెజీనాను ఈ చిత్రంలో చూడబోతున్నాం. వింత హెయిర్ స్టైల్‌తో పాటు అల్ట్రా మోడల్ లుక్‌తో, ఒండినిండా టాటూలతో వింతగా ఉండి ఆకట్టుకుంటుంది. రెజీనా లుక్ విడుదల అవ్వడంతో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న ఆసక్తి కాస్త డబుల్ అయ్యింది. రెజీనా లుక్ అలా ఎందుకు ఉంది, అసలు సినిమా కథ ఏంటీ? సినిమాలో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను నాని ఇవ్వబోతున్నాడో అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.