లిక్కర్ స్కాములో ఎమ్మెల్సీ కవితకు ఊరట…!

TG Politics: New twist in Delhi Liquor case.. Kavitha is the accused..!
TG Politics: New twist in Delhi Liquor case.. Kavitha is the accused..!

ఢిల్లీ మద్యం కుంభకోణం పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. మద్యం కుంభకోణంలో తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడాన్ని ఆమె సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత సవాలు చేశారు .
కవిత పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి నవంబర్‌ 20కి వాయిదా వేసింది.

గత విచారణలో ఈడీ సమన్లను కూడా కవిత తప్పుబట్టారు. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదన్నారు. ఈడీ దర్యాప్తుపై నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు కవిత పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు విచారించింది. నవంబర్‌ 20వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ… సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని వెల్లడించింది.