తెల్లజుట్టు నల్లగా మారుతుందట

తెల్లజుట్టు నల్లగా మారుతుందట

వ‌య‌సు మీద ప‌డి జుట్టు రంగు మారితే పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు కానీ.. చిన్న వ‌య‌సులో ఉన్న యువ‌త‌కు నిండా 20 ఏళ్లు కూడా నిండ‌క‌ముందే.. జుట్టు రంగులు మారితే.. వాళ్ల ప‌రిస్థితి చెప్పనవసరం లేదు. అయితే.. చాలామందిలో జుట్టు రంగు గ్రే క‌ల‌ర్‌లో మార‌డానికి అస‌లు కార‌ణాలేంటో ప‌రిశోధ‌కులు తెలుసుకున్నారు. అస‌లు.. జుట్టు గ్రే క‌ల‌ర్‌లోకి మారితే.. దాన్ని తిరిగి మునపటిలాగా తీసుకురాలేమా? జ‌ట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా మారాలంటే ఏం చేయాలి? గ్రే క‌ల‌ర్‌లోకి మార‌కుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది జుట్టుకు హెయిర్ డైల‌ను వేసుకుంటారు. దాని వ‌ల్ల‌.. జుట్టు గ్రే క‌ల‌ర్‌లోకి మారుతుంది అని అపోహ ప‌డుతుంటారు. హెయిర్ డైల వ‌ల్ల జుట్టు రంగు మార‌డం నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. అది శాశ్వ‌తం కాదు. కొన్ని రోజుల వ‌రకే హెయిర్ అలా ఉంటుంది. కొన్ని రోజుల త‌ర్వాత హెయిర్ మునపటి రంగుకు మారాల్సిందే. కానీ.. అస‌లు గ్రే క‌ల‌ర్‌లోకి శాశ్వ‌తంగా జుట్టు మార‌డం అనేది మాత్రం ఆలోచించాల్సిన విష‌య‌మే.

ఈరోజుల్లో చాలామంది బాగా ఒత్తిడికి లోన‌వుతున్నారు. ఉద్యోగం వ‌ల్ల కావ‌చ్చు.. ఫ్యామిలీ స‌మ‌స్య‌ల వ‌ల్ల కావ‌చ్చు.. ఇత‌ర ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కావ‌చ్చు.. ఎవ‌రైతే తీవ్రంగా ఒత్తిడికి లోన‌వుతారో.. వాళ్ల‌లో ఈ జుట్టు రంగు స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చిన్న‌వ‌య‌సు అయినా పెద్ద వ‌య‌సు అయినా.. ఒత్తిడి ఎక్కువైతే.. జుట్టు రంగు మారుతుంది. కొంద‌రికి గ్రే రంగులోకి మారుతుంది. మ‌రికొంద‌రి జుట్టు ఏకంగా తెల్ల‌గా అయిపోతూ ఉంటుంది. దానికి కార‌ణం అధిక ఒత్తిడే.

ఒకవేళ చిన్న‌వ‌య‌సులోనే జుట్టు రంగు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారు.. ఒత్తిడిని జ‌యిస్తే చాలు.. జుట్టు రంగు కూడా తిరిగి పూర్వ‌స్థితికి వ‌స్తుంద‌ని రీసెర్చ‌ర్స్ చెబుతున్నారు.కొలంబియా యూనివ‌ర్సిటీకి చెందిన రీసెర్చ‌ర్స్ జుట్టు రంగు మారడానికి గల కారణాల మీద ప‌రిశోధ‌న చేశారు. కొంద‌రిపై ప‌రిశోధ‌న చేసి.. వాళ్ల‌లో ఒత్తిడిని పెంచి చూశారు.. దీంతో వాళ్ల జుట్టు రంగు మార‌డం గ‌మ‌నించారు. ఆ త‌ర్వాత కొంద‌రిని వెకేష‌న్‌కు పంపించి.. ఒత్తిడిని త‌గ్గించేలా.. వాళ్లు రిలాక్స్ అయ్యేలా చేశారు.

కొన్ని రోజుల‌కే గ్రే రంగులో ఉన్న వెంట్రుక‌లు కాస్త‌.. డార్క్‌గా మార‌డం వాళ్లు గ‌మ‌నించారు.అయితే.. ద‌శాబ్దాల పాటు.. జుట్టు రంగు గ్రేగా ఉంటే మాత్రం కేవ‌లం ఒత్తిడి త‌గ్గించి.. రంగును మార్చ‌డం కుద‌ర‌ద‌ని.. చిన్న వ‌యస్సు, మ‌ధ్య వ‌య‌స్సులోని వారికి ఇటువంటి స‌మ‌స్య‌లు ఉంటే.. వాళ్ల‌కు మాత్రం ఒత్తిడిని త‌గ్గించి.. వాళ్ల జుట్టు రంగును య‌థాస్థితికి తీసుకురావ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేశారు.హెయిర్ ప్యాక్‌ను ఉసిరి మరియు హెన్నాతో తయారు చేస్తారు.

ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసే ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల కొంత వరకు గ్రేహెయిర్ ను నివారించవచ్చు. హెన్నాను పేస్ట్ లా తయారు చేసుకొని అందులో 3టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మొదళ్ళ వరకూ బాగా పట్టించాలి. తర్వాత ఇది బాగా తడి ఆరే వరకు ఉండి, నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలకు నేచురల్ కలర్ మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందవచ్చు.

చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ సమస్య ఉంటే, అందుకు బ్లాక్ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులో టీఆకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలారా పోసుకోవాలి. బ్లాక్ టీ నీరు తలకు పోసుకొన్న తర్వాత షాంపూ వాడకూడదని గుర్తుంచుకోవాలి. ఈ హోం రెమడీ గ్రే హెయిర్‌ను చాలా సున్నితంగా కవర్ చేసేస్తుంది.

ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారించుకోవాలంటే కరివేపాకును మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి హెయిర్ రూట్స్‌కు శక్తిని అందిస్తాయి. మరియు కొత్త కణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి మరియు నార్మల్ కలర్‌ను కలిగి ఉంటాయి. కరివేపాకును చట్నీ రూపంలో లేదా మజ్జిగలో వేసుకొని తాగవచ్చు.

కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులను మరియు ఉసిరి కాయ ముక్కలను వేసి బాగా మరగ కాచి, చల్లార్చి బాటిల్లో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కేశాలు స్ట్రాంగ్‌గా మరియు హెల్తీగా ఉంటాయి. మరియు ఒరిజినల్ కలర్‌ను కలిగి ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల గ్రేహెయిర్ ను నివారించుకోవచ్చు.

కేశాలు తిరిగి ఒరిజినల్ కలర్ పొందడానికి మరియు ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్‌ను నివారించుకోవడానికి అమరాంత్ రసంను జట్టుకు మరియు తల మాడుకు పట్టించడం ఒక అద్భుతమైన మార్గం. ఈ వెజిటేబుల్ మీ జుట్టు పెరుగుదలను వేగవంతం మరియు మృదువైన మరియు మెరిసేలా ఉంచడం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

ఆమ్లా కేశాలను డార్క్, షైనింగ్‌గా ఉంచడానికి ఆమ్లా హెయిర్ టానిక్ గా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలతో పాటు మంచి రంగును అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఒరిజినల్ హెయిర్ కలర్ కలిగి ఉండాలంటే బాదం ఆయిల్ ఆమ్లా జ్యూస్‌ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఆమ్లాను తలకు పట్టించడంలో చిన్న వయస్సులోనే గ్రేహెయిర్ ను నివారిస్తుంది.

చక్కెర, పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన పిండి, ప్యాక్ చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, చాలా జంతు ప్రోటీన్లు వంటి కలుషితాలను వదిలివేయండి.సీ వీడ్ ట్రై చేయండి. ఇది మీ అన్ని ఖనిజాలను, ముఖ్యంగా జింక్, మెగ్నీషియం, సెలీనియం, వంటి పోషకాలు అందించడంలో సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ అన్ని టిప్స్ ఫాలో అవ్వండి గ్రే హెయిర్ వంటి జుట్టు సమస్యలు దూరం చేసుకోండి.