ఆ మంత్రులని బర్తరఫ్ చేయండి !

 Remove the ministers who played jokes at vajpayee smaran sabha

 

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను నదుల్లో కలిపే కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ బీజేపీనిర్వహించిన సంస్మరణ సభకు ఛత్తీస్‌గఢ్‌ వ్యవసాయశాఖ మంత్రి బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌, ఆరోగ్యశాఖ మంత్రి అజయ్‌ చంద్రకర్‌ హాజరయ్యారు. సభ జరుగుతుంటే వీరిద్దరూ నవ్వుకుంటూ, జోకులేసుకుంటూ కనిపించడం తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రులపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. ఒక మాహా నేత సంస్మరణ సభలో ఎలా వ్యవహరించడలో తెలియదా అంటూ వారి మీద నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

vajpayee

అయితే సంస్మరణ సభలో నవ్వుతూ ముచ్చట్లాడుకున్న ఇద్దరు మంత్రులపై వేటేయాలని వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లా డిమాండ్ చేశారు. సంస్మరణ సభలో ఆ మంత్రులు వ్యవహరించిన తీరు తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. వాజ్‌పేయిపై వారికి ఎటువంటి గౌరవం లేదని, ఏదో రావాలి కాబట్టి సభకు వచ్చారని పేర్కొన్నారు. వారిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తర్వాతి తరం నాయకులకైనా తెలిసి వస్తుందన్నారు. మంత్రులు వ్యవహరించిన తీరుపై చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శైలేశ్ నితిన్ త్రివేదీ మాట్లాడుతూ.. వాజ్‌పేయిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ, ఇటువంటి చేష్టలతో అగౌరవపర్చడం సరికాదని ఆయన బీజేపీ నేతలకు సూచించారు.

 vajpayee smaran sabha