పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. తాను రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించిన రేణుదేశాయ్ తాజాగా ఆదివారం తనకు కాబోయే భర్తతో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. నిశ్చితార్థంకు సంబంధించిన విషయాన్ని రేణుదేశాయ్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూణెకు చెందిన వ్యక్తితో ఈమె వివాహ నిశ్చితార్థం అయ్యింది. ఇక రేణుదేశాయ్ తనకు కాబోతున్న భర్త విషయంలో చాలా రహస్యంను పాటిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అతడి పేరు కాని, అతడికి సంబంధించిన విషయాలను కాని వెళ్లడి చేయలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక వైపు రేణును వివాహం చేసుకోవద్దంటూ చెబుతున్న సమయంలో తన కాబోయే భర్త విషయాన్ని బయటకు పెట్టడం మంచిది కాదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రేణుదేశాయ్ తాజాగా వివాహ నిశ్చితార్థ సమయంలో కూడా చాలా గోప్యతను పాటించడం జరిగింది. అతి తక్కువ మంది సమక్షంలో ఈ వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహం కూడా చాలా రహస్యంగా చేసుకోవాలని రేణుదేశాయ్ భావిస్తున్నారు. ప్రస్తుతం రేణుదేశాయ్ గోవాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే వీరి వివాహ నిశ్చితార్థం గోవాలో అయ్యి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. రేణుదేశాయ్ చేసుకోబోతున్న వ్యక్తి వ్యాపారవేత్త అని, అతడు రేణు దేశాయ్‌కి చాలా కాలంగా తెలుసని, రెండు సంవత్సరాలుగా వీరిద్దరి వివాహంకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొన్నటి వరకు పెళ్లి వద్దనుకున్న రేణుదేశాయ్ తాజాగా మనసు మార్చుకుని వివాహంకు సిద్దం అయ్యింది. పెళ్లికి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో అని రేణు బయపడిందంట, ఆ కారణంగా కూడా పెళ్లిని కొన్నాళ్లుగా రేణు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.