రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ‘బద్రి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడిగా నటించిన ఆమె పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వార్దిదరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు. వీరికి కుమారుడు అకిరా నందన్, కూతురు ఆధ్యలు ఉన్న విషయం తెలిసిందే.
అయితే పవన్, రేణులు విడిపోయినప్పటికి తామీద్దరం స్నేహితులమేనని, తాము ఎప్పుటికి మంచి శ్రేయోభిలాషులుగా ఉంటామంటూ రేణు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేగాక పవన్ కూడా అప్పడప్పుడు వారి దగ్గరికి వెళుతుంటారని పిల్లలతో సరదాగా సమాయాన్ని గుడుపుతుంటారని ఆమె చెప్పేవారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా, కూతురు ఆధ్యలను ఒళ్లో కూర్చోపెట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను రేణు దేశాయ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.