బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక సమర్పించింది. వైట్ పేపర్ ఆన్ ఏపీసీఆర్డీఏ పేరుతో బీసీజీ నివేదిక అందించింది. నివేదికలోని అంశాలను జగన్‌కు తెలిపారు బీసీజీ ప్రతినిధులు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఎక్కడెక్కడ ఏ ఏఆఫీసులు పెట్టారో.. ఆ కమిటీ సూచించింది. ఇప్పుడు.. బోస్టన్ కమిటీ.. సీఆర్డీఏపై నివేదిక ఇచ్చింది. ముందుగానే.. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. రాజధానికి పెట్టుబడి పెట్టడం.. దండగ అని.. బీసీజీ రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. రాజధానికి పెట్టే ఖర్చు మొత్తం గోడకు కొట్టిన సున్నమని.. అక్కడ పెట్టే ఖర్చులో పది శాతం.. విశాఖలో పెడితే.. మరో హైదరాబాద్ అవుతుందని రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కమిటీల నివేదికలను పరిశీలించడానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. ఈనెల 6న రెండు నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలిస్తుంది. 8న రెండు నివేదికలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఈనెల 20లోపు హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుంది. హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మూడు నివేదికలపై అసెంబ్లీలోనూ చర్చించిన తర్వాత మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని జగన్ అధికారికంగా వెల్లడిస్తారు.
ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం. తన దారితో తాను వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి ఎందుకు అంటే.. టీడీపీ చెప్పే కారణాలు అయిన .. రాష్ట్రం మధ్యలో ఉండటం.. సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఆదాయ వనరు వంటి వాదనలకు కౌంటర్ గా .. అవేమీ పని చేయవని.. పనికి మాలిన వాదనలని చెప్పేందుకు నిపుణుల పేరుతో జగన్ కమిటీల నివేదికలను తెప్పిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.