ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజుల క్రితం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! వాల్ స్ట్రీట్జర్నల్ నివేదికను తప్పుబడుతూ ఫేస్బుక్ ఘాటుగా సమాధానమిస్తోంది. కొంత మంది వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్ చేసిన ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టింది. ప్రతి యూజర్‌ను తమ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తామని ఫేస్బుక్ పేర్కొంది.
యూజర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని 2016 నుంచి సుమారు 13 బిలియన్ డాలర్లను ఖర్చు చేసిందని ఫేస్బుక్ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటీ కోసం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య పదివేల నుంచి..40 వేల వరకు పెరిగిందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సుమారు 3 బిలియన్ల నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తీసేసినట్లు తెలిపింది.
కోవిడ్-19 సమయంలో ఫేక్ సమాచారాన్ని ఎక్కువగా సర్క్యూలేట్ అవ్వకుండా చూశామని ఫేస్బుక్ వెల్లడించింది. సుమారు 20 మిలియన్ల తప్పడు వార్తలను అరికట్టామని ఫేస్బుక్ తెలిపింది. ఇమేజ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రమాణాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను గతంలో కంటే15 రెట్లు ఎక్కువగా తొలగిస్తున్నామని పేర్కొంది.