రీసెంట్ గా మన టాలీవుడ్ ప్రముఖ కుటుంబం మంచు వారి కుటుంబంలో జరిగిన పలు సంఘటనలు ఎలా మారాయో తెలిసిందే. మంచు మనోజ్ అలాగే తన తండ్రి మోహన్ బాబు సహా మంచు విష్ణు ఎంట్రీతో పరిస్థితులు ఊహించని విధంగా మారుతూ వెళ్లాయి. అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు ఒక మీడియా రిపోర్టర్ పై అమానుషంగా దాడి చేయడం ఆలాగే దాడి చేస్తూ బూతులు కూడా మాట్లాడ్డం జరిగింది.
దీనితో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది . అయితే ఈ ఘటనపై మోహన్ బాబు లేటెస్ట్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. తాను గత 48 గంటల నుంచి హాస్పిటల్ లోనే ఉన్నాను అని అందుకే ఆ ఘటనపై వెంటనే స్పందిచలేకపోయాను అని తాను తెలిపారు. ఆ హీట్ మూమెంట్ లో నా ఇంటి గేటు బద్దలుకొట్టారు. దాదాపు 30 నుంచి 50 మంది ఎవరో వచ్చేసారు. దీనితో నేను నా సహనం కోల్పోయానని ఆ సమయంలో జరిగిన దాడిపై చింతిస్తున్నాను అని అలాగే ఆ ఛానెల్ వారికి అతని కుటుంబానికి కూడా క్షమాపణలు తెలిపారు.