ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు.. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ జరగనుంది.