కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి AICC తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని.. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పొలీసులను వెనక్కి పిలవాలని.. నిషేదాజ్ఞలు ఎత్తివేయాలని టీచర్స్ అసోసియేషన్స్, సివిల్ సొసైట్ సభ్యులు కోరారు. ఈ విజ్ఞప్తితో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీచేశారు.


