తెలంగాణ రాష్ట్రం లో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం లో జరిగిన ప్రమాదం పై కాంగ్రెస్ మరియు బీజేపీ కి చెందిన నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరు ను తప్పు బడుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నే ఘటన చోటు చేసుకుంది అంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటన పై కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటన పై సీబీఐ తో పాటుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తో శాఖ పరమైన విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కి రేవంత్ ఫిర్యాదు చేయడంతో మరొకసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ ఘటన తో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి రాసినటువంటీ లేఖ లో పేర్కొన్నారు. ఎండీ ప్రభాకర్ హయాంలో ఇచ్చినటువంటీ విద్యుత్ కొనుగోలు మరియు టెండర్ ల పై విచారణ జరిపించాలి అని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాక బయట ఎవరి వద్ద నుండి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ కి చెందిన నేతల ఎలా స్పందిస్తారో చూడాలి.