హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సంచలనం సృష్టించిన పబ్-డ్రగ్స్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో రేవంత్ దగ్గరిబంధువు పేరుతో టీఆర్‌ఎస్ ఆరోపణలకు దిగగా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి ప్రతిసవాల్ విసిరాడు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాడి చేసిన పబ్బుకు 24 గంటల అనుమతి ఇచ్చింది ఎవరు?.. రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నిలదీసిన ఆయన, 125 మందికి టెస్టులు చేయకుండా ఎందుకు వదిలేశారని నిలదీశారు. ఈ వ్యవహారంలో నా వాళ్లున్నా శిక్షించండి. అంతేగానీ చిన్నపిల్లలను అడ్డుం పెట్టకుని.. చిల్లర రాజకీయాలు చేయడం ఏంట’’ని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
‘‘మా వాళ్లపై అనుమానాలు ఉంటే, ఏ ఆస్పత్రికైనా తీసుకొస్తా. మా పిల్లలందరికీ డ్రగ్స్ టెస్టులు చేయిస్తా. కేసీఆర్.. నీకొడుకు కేటీఆర్‌ను కూడా డ్రగ్స్ టెస్ట్‌కు పంపిస్తావా?’’ అంటూ నేరుగా టీఆర్‌ఎస్ అధినేతకే సవాల్ విసిరాడు రేవంత్. ఈ విషయంలో తాను నైతిక బాధ్యతతో ఉన్నానని.. కానీ, కావలసిన వాళ్లు ఉన్నారనే అందరిని ఈ ప్రభుత్వం వదిలేసిందని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.