రేవంత్ రెడ్డి అరెస్ట్ కు టీఆర్ఎస్ స్కెచ్…నోటీసులు…!

Congress To Field Revanth Reddy In Parliament Elections

కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత చిక్కుల్లోపాడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతల మీద పగబట్టినట్టు పాత కేసులు అన్నీ తోడుతున్న పోలీసులు ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అరెస్ట్ చేయగా, మరో నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసునమోదు చేశారు. తాజాగా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నేత అయిన రేవంత్ రెడ్డి కి 41సీఆర్సీ కింద నోటీసులు జారీ అయ్యాయి. 2001 నాటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. 15రోజుల్లోగా విచారణకు హాజరై సమాధానం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి సహా 13మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఈ నోటీసులకు రేవంత్ స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని, ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు.

raventh-reddy-arrest
2001 నాటి ఈ కేసులో రేవంత్ మీద కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని జూబిలీ హిల్స్ కు చెందిన అడ్వొకేట్ రామారావు ఇటీవల సీపీ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆయన రేవంత్ ను ఎంక్వైరీ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని లేఖ వ్రాయడంతో ఇప్పుడు ఈ కేసుకు సంబందించే రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఎన్నికల బిజీలో ఉన్నందున తాను హాజరుకాలేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారనే విషయమై రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. రేవంత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

raventh-reddy