టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండకు వెళ్తుండగా పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో చేపట్టనున్న ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండిస్తున్న ఆంశాన్ని మీడియాకు చూపిస్తున్నాని ఆదివారం రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ రోజు ఉదయాన్నే పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఆయన బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.