Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా పొలిటికల్ హాట్ టాపిక్ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రంగప్రవేశం జరిగిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి తమతో పాటు వచ్చిన 18 మంది తో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నిజానికి ఇంకొద్ది రోజుల్లో తెలంగాణాలో రాహుల్ సభ ఉన్నందున ఢిల్లీలో రేవంత్ చేరికని సింపుల్ గా ముగించేద్దామని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. దీని వెనుక కొందరు టీ కాంగ్రెస్ నేతల హస్తం ఉందని కూడా సమాచారం. రేవంత్ కి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఇష్టం లేని నేతలు ఓ రకంగా హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తే దానికి నెంబర్ సెంటిమెంట్ తో రేవంత్ కౌంటర్ వేసాడు.
రేవంత్ రెడ్డి కి 9 నెంబర్ కలిసొస్తుందని నమ్మకం. అందుకే మొత్తం 18 మంది తమతో పాటు కాంగ్రెస్ లో చేరేలా ప్లాన్ చేశారు. నెంబర్ సెంటిమెంట్ చెప్పడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా నో చెప్పలేకపోయింది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకుల జాబితా ఇదే… రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయ రమణ రావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాపూరావు, రమేష్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, తోటకూర జానయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం , హరిప్రియ నాయక్, బాల్యా నాయక్, రాజారాం యాదవ్ సహా మరో ముగ్గురు ఉస్మానియా జాక్ నేతలు రాహుల్ చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.