తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి లేఖ

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు, మద్య తరగతి ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. లాక్ డౌన్ అమలు ఉండటం వలన పనులు లేక, జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో విద్యుత్ బిల్లులను వాయిదా లో చెల్లిస్తే1.5 శాతం వడ్డీలు వసూలు చేస్తామని అనడం దారుణం అని కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

తెలంగాణ లో పేద, మద్య తరగతి ప్రజలకి విద్యుత్ చార్జీల మదింపు లో రాష్ట్ర ప్రభుత్వం చిల్లు పెడుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశాల పై రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక లేఖ రాశారు. అయితే మూడు నెలల వినియోగాన్ని కలిపి లెక్కిస్తే శ్లాబులు మారుతున్నాయి అని గుర్తు చేశారు. అంతేకాక వినియోగ దారులకు ఇది చాలా భారం అని అన్నారు. ప్రస్తుతం 100 యూనిట్ల శ్లాబ్ వినియోగ దారులు300 యూనిట్ల లోకి వచ్చారు అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి ఇంకా విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి పోయి కష్టం లో ఉన్న పేద, మద్య తరగతి ప్రజలకు ప్రభుత్వం షాక్ ఇస్తుంది అని వ్యాఖ్యానించారు.ఒక్క రూపాయి అదనపు భారం పడిన ఉపేక్షించేది లేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీని పై ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి తన నిర్ణయం ను సమీక్షించుకోవాలి అని వ్యాఖ్యానించారు.