దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ఎందరో నాయకులు చంద్రబాబు అరెస్ట్ పై తమ తమ అభిప్రాయాలను వినిపించారు. కొందరు ఈ అరెస్ట్ ను ఖండించగా, మరికొందరు నిజానిజాలు తెలిసే వరకు ఈ విషయం మీద ఏమీ మాట్లాడలేము అన్నట్లు స్పందించారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ గురించి మాజీ టీడీపీ నాయకుడు మరియు ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించాడు.
ఒక మీటింగ్ లో భాగంగా మీడియా వ్యక్తి చంద్రబాబు అరెస్ట్ ను ఏ విధంగా మీరు చూస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎలా చూస్తాము .. ఏ విధంగా జరుగుతోందో అదే విధంగా చూస్తున్నాము అంటూ మాట్లాడారు. మాములుగా అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంత సన్నిహితుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. లోపల రేవంత్ కు మండిపోతూ ఉంటుంది. కానీ బయటకు కామెంట్ చేయలేని పరిస్థితి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ మరియు కేసీఆర్ ల హస్తం ఉందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.