రేవంత్‌రెడ్డి విమర్శలు

రేవంత్‌రెడ్డి విమర్శలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంత వరకు ప్రధాని, వ్యవసాయ మంత్రిని అపాయింట్‌మెంట్‌ అడగలేదన్నారు. అలాంటప్పుడు వరి ధాన్యం కొనుగోలు సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ప్రశ్నించారు.

నారాయణపేట జిల్లా కోస్గిలో, వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో గురువారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. బంగారు తెలంగాణగా మారుస్తానని ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేటికీ నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.

కరోనా విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత ఖర్చయింది., సామగ్రి కొనుగోలు విషయంలో తీసుకున్న వివరాలను ఆన్‌లైన్‌లో ఎందుకు పొందుపరచలేదని నిలదీశారు. హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంత భూముల్లో అక్రమాలు జరిగాయని కేసులు వేయగా.. ఈడీ నోటీసులు జారీ చేస్తే స్టే తెచ్చుకోవడం దొంగతనానికి పాల్పడినట్టే కదా? అన్నారు.