Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన టీ టీడీపీ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ భేటీలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంకో షాక్ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, మోత్కుపల్లి లాంటి వాళ్ళు రేవంత్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నేతల్ని కలవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. అధినేత అనుమతి లేకుండా కాంగ్రెస్ తో పొత్తుల గురించి చర్చించే అధికారం ఎవరు ఇచ్చారని రేవంత్ ని మోత్కుపల్లి అడిగారు. ఇక ఆంధ్ర నేతలు పరిటాల, యనమల కుటుంబాల మీద చేసిన ఆరోపణల్ని గురించి కూడా రేవంత్ మీద పార్టీ నాయకులు శరపరంపరగా ప్రశ్నలు సంధించారు. ఎవరెన్ని మాట్లాడినా, ఎంత అడిగినా రేవంత్ మౌనాన్నే ఆశ్రయించారు. అన్ని విషయాల మీద టీడీపీ అధినేత చంద్రబాబుకి సమాధానం చెబుతానని రేవంత్ జవాబు ఇచ్చారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న చంద్రబాబు తిరిగి వచ్చాక రేవంత్ ఆయన్ని కలిసి వివరణ ఇచ్చే అవకాశం వుంది.






