చంపేస్తారట…డీజీపీ మీద నమ్మకం లేదు : ఈసీకి రేవంత్ ఫిర్యాదు…!

Revanth Urges EC To Book Case Against KCR For Offering Rs 10 Crore

తెరాస నాయకుడు, మంత్రి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌లు తనను చంపేస్తామని హెచ్చరించారని, తెరాస ప్రభుత్వ నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు.

kcr

అంతేకాక ఈ రాష్ట్ర డీజీపీ మీద తనకు నమ్మకం లేదని నాగార్జున సాగర్ లో జరుగుతున్న టీఆరెస్ నాయలత్వ శిబిరానికి ఆయన హాజరయ్యారని అందుకే రాష్ట్ర పోలీస్ బాస్, రాష్ట్ర పోలీసుల మీద తనకు నమ్మకం లేదని కేంద్ర బలగాలను తన భద్రత కోసం నియమించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.10 కోట్లు ఇస్తామని చెప్పారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారని, దీన్ని ఈసీ సుమోటోగా స్వీకరించాలని, లేదా తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరానని తెలిపారు.

raventh-reddy