సమీక్ష: “35 – చిన్న కథ కాదు” – ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా ..!

Review: “35 – Not a short story” – A compelling family drama ..!
Review: “35 – Not a short story” – A compelling family drama ..!

విడుదల తేదీ : సెప్టెంబర్ 06, 2024

తెలుగు బులెట్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నివేతా థామస్, విశ్వదేవ్ రాచకొండ, మాస్టర్ అరుణ్ దేవ్, మాస్టర్ అభయ్ శంకర్, గౌతమి, ప్రియదర్శి.

దర్శకుడు: నంద కిషోర్ ఇమాని

నిర్మాతలు : సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి

సంగీత దర్శకుడు: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

ఎడిట‌ర్ : టీసీ ప్రసన్న

 

ఈవారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ మూవీ ల్లో యంగ్ హీరోయిన్ నివేతా థామస్ అలాగే నటుడు విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్ లో దర్శకుడు నందకిషోర్ తెరకెక్కించిన మూవీ “35 చిన్న కథ కాదు” డీసెంట్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. తిరుపతిలో ఒక చిన్నపాటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సత్య ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) అలాగే తన భార్య సరస్వతి (నివేత థామస్) వారి ఇద్దరి పిల్లలు అరుణ్ (అరుణ్ దేవ్ పోతుల) వరుణ్ (అభయ్ శంకర్) లు కలిసి ఎలాంటి చేకూ చింత లేకుండా ఒక హ్యాపీ లైఫ్ ను సాగిస్తారు. తమ ఇద్దరి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇద్దరు తల్లిదండ్రులు అహర్నిశలు తాపత్రయ పడతారు. అయితే వారి పిల్లల్లో అరుణ్ వేసే ప్రశ్నలు చాలా లాజిక్ గా సమాధానం దొరికేలా లేకుండా కూడా ఉంటాయి. దీనితో లెక్కల సబ్జెక్టులో తాను వెనకబడతారు . మరి లెక్కల సబ్జెక్టు మూలాన తన జీవితంలో తన తల్లి సరస్వతి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? ఆ లెక్కల సబ్జెక్టుల లో మినిమమ్ 35 మార్కులతో అరుణ్ పాస్ అవ్వాలనే సందర్భం ఎలా వస్తుంది? చివరికి ఈ కథ ఎలా సుఖాంతం అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ మూవీ ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీ ఖచ్చితంగా తెలుగు ఆడియెన్స్ కు చాలా కాలం తర్వాత ఒక ‘మంచి’ మూవీ చూసాం అనే భావన తప్పక కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ కథనం మొదలైన మొదటి నిమిషం నుంచి ఇంపైన నేపథ్య సంగీతం, తిరుపతి వాతావరణం అంతా చాలా రిఫ్రెషింగ్ గా ఆహ్లదంగా కనిపిస్తాయి . మరి వీటికి తగ్గట్టుగానే మూవీ లో కూడా ఆద్యంతం వినోదాత్మకంగా నడుస్తుంది.

Review: “35 – Not a short story” – A compelling family drama ..!
Review: “35 – Not a short story” – A compelling family drama ..!

ముఖ్యంగా చిన్న పిల్లల నడుమ స్కూల్ సన్నివేశాలు అన్నీ మంచి హాస్యాన్ని కూడా పండిస్తాయి. అలాగే మూవీ లో సెకండాఫ్ చూసే వీక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది అని చెప్పుకోవాలి . ఇక నటీనటుల్లో అయితే ఎవరికి వారే అద్భుతమైన అద్భుతమైన పెర్ఫామెన్స్ లని అందించారు. బాలయ్య నటులు అరుణ్ నుంచి సీనియర్ నటి గౌతమి వరకు ఎంతో డీసెంట్ పెర్ఫామెన్స్ ను అందించారు.

ఇక ముఖ్య పాత్రధారిణి నివేత థామస్ కోసం మాట్లాడుకోవాలి. తన పాత్రలో నివేత చక్కగా ఒదిగిపోయింది.. ఇంట్లో పనులు చేస్తూ ఒక గృహిణిగా భర్త కోసం తాపత్రయపడే భార్యగా పిల్లల భవిష్యత్తుకి ఆరాటపడే తల్లిగా ఇలా అన్ని కోణాల్లో నివేతా థామస్ తనలోని నటిని అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో తనపై ప్రతి సీన్ చాలా బాగుంది. తన కొడుకుతో సంఖ్య ’10’ కోసం చెప్పే డైలాగ్ అయితే మూవీ లో వావ్ అనిపించేలా ఎగ్జైట్ చేస్తుంది అని చెప్పాలి.

మరి తనకి భర్తగా నటించిన యువ నటుడు విశ్వదేవ్ మంచి నటన కనబరిచారు . తాను పలికే ప్రతి డైలాగ్ మూవీ లో అర్ధవంతంగా అనిపిస్తాయి. ఇంకా నటుడు ప్రియదర్శి కొంచెం నెగిటివ్ కోణంలో కనిపించి ఆకట్టుకుంటారు . కొన్ని సీన్స్ లో తన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక మూవీ లో కనిపించే బాల్య నటులు అరుణ్, అభయ్ సహా ప్రతీ ఒక్కరూ ఎంతో సహజ నటనతో తమ రోల్స్ ను అద్భుతంగా రక్తి కట్టించారు. ఇంకా మూవీ లో కదిలించే ఎమోషన్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్:

ఈ మూవీ లో మొదటిసగం కథనం కొంచెం నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. అలాగే మలిసగంలో కూడా ఒకటి రెండు చోట్ల కొంచెం స్లో గ ఉంది అనే భావన కలుగుతుంది. అలాగే మూవీ లో మూల కథ సింపుల్ గానే అనిపిస్తుంది. దీనితో మరీ ఎక్కువ కొత్తదనం కోరుకునేవారు కొంచెం నిరాశ చెందవచ్చు.

ఇంకా నటి గౌతమి పాత్రను ఇంకాస్త ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే మూవీ లో కొన్ని కొన్ని చోట్ల మరింత ఎమోషన్స్ ను పండించే ప్రయత్నం చేయాల్సింది. ముఖ్యంగా అరుణ్, నివేత థామస్ నడుమ సెకండాఫ్ లో కనిపించే లాంటి సీన్స్ కొంచెం ముందు నుంచే ఉండుంటే ఇంకాస్త బెటర్ ఫీల్ గా కలిగి ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ మూవీ లో సురేష్ ప్రొడక్షన్స్ వారి సమర్పణలో వచ్చిన ఈ మూవీ నిర్మాణ విలువలు బాగున్నాయి. వారి నుంచి ఇది మరో మంచి మూవీ అని చెప్పవచ్చు. మరి ఈ మూవీ కి మళ్ళీ వివేక్ సాగర్ తన మార్క్ మ్యూజిక్ ను అందించి మైమరపించారు . పాటలు నేపథ్య గీతం రెండిటిలో కూడా తన మార్క్ ట్యూన్స్ తో మూవీ కి అదనపు బలం అయ్యాడు. ఇంకా నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం చాలా చాలా బాగుంది. చాలా వరకు సహజమైన విజువల్స్, తిరుపతి ప్రాంతాన్ని చాలా అందంగా చూపించాడు. టీసీ ప్రసన్న ఎడిటింగ్ కూడా నీట్ గానే ఉన్నది .

ఇక దర్శకుడు నందకిషోర్ ఇమాని విషయానికి వస్తే.. తను ఈ మూవీ కి అందించిన పనితనం ఆకట్టుకుంటుంది. అందరికీ తెలిసిన లైన్ ని పట్టుకున్నప్పటికీ దానిని తెరకెక్కించిన విధానంకి ఎక్కువ మార్కులు కూడా ఇవ్వొచ్చు. ఇంపైన భావిద్వేగాలు, మంచి కామెడీ సీన్స్, నటీనటుల నుంచి ఏ మోస్తరు నటన రాబట్టాలో ఇలా అన్నిటిలో తన పనితనం మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “35 చిన్న కథ కాదు” అనేది నిజంగా చిన్న కథేమీ కాదని మనం చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే ప్రతి ఒక్కరిని ఈ మూవీ మెప్పిస్తుంది. అలాగే చాలా రోజుల తర్వాత ఈ భారీ, భారీ మూవీ లు నడుమ ఒక చిన్న సింపుల్ తెలుగు మూవీ చూసాం అనే భావన ఈ మూవీ కలిగిస్తుంది. చిన్న చిన్న పొరపథ్యాలు ఉన్నాయి కానీ వాటిని పక్కన పెడితే ఈ వారాంతానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనర్ గా అయితే ఈ మూవీ మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.