సమీక్ష : “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” – నిజంగానే గ్రేట్ ఏనా?

Review : “The Greatest of All Time” – Really Great?
Review : “The Greatest of All Time” – Really Great?

విడుదల తేదీ : సెప్టెంబర్ 05, 2024

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్ జీ

దర్శకుడు: వెంకట్ ప్రభు

నిర్మాతలు : కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పత్తి సురేష్

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నుని

ఎడిట‌ర్ : వెంకట్ రాజేన్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చింది. మరి తమిళ్ సహా తెలుగులో కూడా రిలీజ్ కు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథ లోకి వస్తే.. గాంధీ (విజయ్ జోసెఫ్) భారత దేశం తరపున సీక్రెట్ గా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తుంటారు . అయితే ఒక మిషన్ మీద కెన్యాలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఆపరేషన్ లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్ (మైక్ మోహన్) మట్టుబెడతారు . అయితే ఆ తర్వాత మరో మిషన్ మీద మరో దేశానికి తన భార్య అను (స్నేహ) తన కొడుకు జీవన్ తో కలిసి ట్రిప్ కి కూడా వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది? తన కొడుకు జీవన్ కు ఏమవుతుంది. పెద్దయ్యాక తన కొడుకు ఏం చేస్తారు ? ఇద్దరూ తండ్రీకొడుకులు శత్రువులుగా ఎలా మారిపోతారు ? చివరకి జీవన్ (జూనియర్ విజయ్) కథ ఎలా ముగుస్తుంది అనేవి తెలియాలి అంటే ఈ మూవీ ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీ లో దళపతి విజయ్ మంచి హైలైట్ గా నిలిచారు అని చెప్పాలి. తన మార్క్ స్వాగ్, హీరోయిజం చాలా మూవీ ల్లో చూసాం కానీ ఈ మూవీ లో అంతకు మించి తను సర్ప్రైజ్ చేస్తాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో దళపతి విజయ్ బాగా అదరగొట్టారు
అని చెప్పాలి. అలాగే తనతో కనిపించిన ప్రభుదేవా, జయం రవి సహా ప్రశాంత్ లు తమ పాత్రల ల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి బాగా అదరగొట్టారు.

Review : “The Greatest of All Time” – Really Great?
Review : “The Greatest of All Time” – Really Great?

అలాగే స్నేహ తన రోల్ లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి తన గ్లామర్ షోతో తో సహా తనకున్న కీలక సీన్స్ లో బాగానే చేసింది. ఇక ఈ మూవీ లో సెకండాఫ్ ని డీసెంట్ గా తీసుకెళ్లడం చాల బాగుంది. అక్కడక్కడా మంచి హై మూమెంట్స్, విజయ్ మార్క్ డైలాగ్స్ ఇంకా క్లైమాక్స్ లో చెన్నై ముంబై మ్యాచ్ కామెంట్రీతో విజయ్ రోల్స్ ను హైలైట్ చేస్తూ చూపించిన సీన్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తాయి. ఇంకా సెకండాఫ్ లో త్రిష, శివ కార్తికేయన్ ల సర్ప్రైజింగ్ క్యామియోలు చాలా బాగున్నాయి. అలాగే కొన్ని ట్విస్ట్ లు పర్వాలేదు అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

మరి ఈ మూవీ రీసెంట్ టైంలో విజయ్ అటు దర్శకుడు వెంకట్ ప్రభు నుంచి మరో వీక్ వర్క్ అని చెప్పుకోవాలి . మూవీ నిడివి బాగా పెద్దది కావడంతో చాలా వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ కథనం కూడా అంత ఎంగేజింగ్ గా ఏమి లేదు . ఇక మూవీ చూస్తున్నంతసేపు కొన్ని మూవీ లు అలా గుర్తొస్తాయి కానీ పోస్ట్ క్లైమాక్స్ చూశాక మాత్రం హాలీవుడ్ మూవీ జెమినీ మ్యాన్ ను చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మరింత డిజప్పాయింట్ అవుతారు.

ఈ మూవీ తో లింక్ ఉందని ముందే కామెంట్స్ కూడా వచ్చాయి. సరిగ్గా దీనినే చూపించి ఆడియెన్స్ ను మరింత నీరు గార్చారు. మరి ఆ మూవీ ని చూడని వారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు తప్పితే ఇది కూడా అంత ఎగ్జైటింగ్ గా ఉండదు. అలాగే మూవీ లో కొన్ని ఓవర్ సీన్స్ కూడా ఉన్నాయి. లాజిక్ లేకుండా సిల్లీగా చికాకు తెప్పించేలా అనిపిస్తాయి.

ఇక వీటితో పాటుగా మీనాక్షి చౌదరికి పెద్దగా ఇంపార్టెన్స్ మూవీ లో లేదు ఏదో నామమాత్రంగా మాత్రమే తీసుకున్నారు అని చెప్పాలి. ఇంకా ఇలా చాలా సీన్స్ ఊహాజనితంగానే అనిపిస్తాయి. అలాగే పోస్ట్ క్లైమాక్స్ పోర్షన్ జెమినీ మ్యాన్ చూసిన వాళ్ళకు నిరాశ కలిగిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ మూవీ లో నిర్మాణ విలువలు కొన్ని అంశాల్లో చాలా బాగున్నాయి. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నాయని చెప్పుకోవాలి . టెక్నికల్ గా విజయ్ డీ ఏజింగ్ లుక్ ను తీర్చిదిద్దిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. యంగ్ లుక్ లో విజయ్ సీన్స్ ను టీం బాగా చూపించారు. ఇక కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ వి ఎఫ్ ఎక్స్ వర్క్ చాలా వీక్ గా కనిపిస్తూన్నాయి . యువన్ సాంగ్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి కానీ కొన్ని సీన్స్ ను తన స్కోర్ తో బాగా ఎలివేట్ చేసారు . ఇక ఈ మూవీ లో సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నది . ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉన్నది

ఇక దర్శకుడు వెంకట్ ప్రభు విషయానికి వస్తే.. తన మూవీ లపై మినిమం ఐడియా ఉన్న సినిమా లవర్స్ కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు. కానీ ఈ మూవీ లో అది మిస్ అయ్యింది. నైస్ గా హాలీవుడ్ మూవీ జెమినీ మ్యాన్ కాన్సెప్ట్ ను తస్కరించి విజయ్ కు సూటయ్యేలా అక్కడక్కడ ఫ్యాన్స్ స్టఫ్ తో తను మార్చేశారు . కేవలం కొన్ని అంశాల్లో తప్ప తన దర్శకత్వం గత మూవీ లతో పోలిస్తే వీక్ గా ఉంటుంది అని చెప్పక తప్పదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” మూవీ లో విజయ్ అదరగొడతారు అని చెప్పాలి. మెయిన్ గా తన ఫ్యాన్స్ అతన్ని నెగిటివ్ రోల్ లో చూడటం ఎగ్జైట్ చేస్తుంది. అలాగే కొన్ని మూమెంట్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ వాహ్.. అనిపించే రేంజ్ లో ఎక్కడా కూడా అనిపించవు. పైగా సాగదీతగా అనిపించే కథనం, చాలా చోట్ల ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే డిజప్పాయింట్ చేస్తుంది. ఇక వెంకట్ ప్రభు నుంచి అయితే కొత్తదనాన్ని ఆశించే వారు మరింత డిజప్పాయింట్ కూడా అవ్వొచ్చు. వీటితో అయితే ఈ మూవీ అంత గ్రేట్ గా ఏమీ అనిపించదు