Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే… కాదు కాదు… సంచలనం అయ్యేదే ఆయన చేస్తారు అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. కొన్నాళ్లుగా టీవీ ఛానెల్స్ లో చర్చలు చూసి చూసి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ లో ఏముందని ఆత్రపడుతున్న జనాల ముందుకు ఆ వీడియో వచ్చేసింది. వర్మ దీన్ని వీడియో అని అంటున్నప్పటికీ ఓ డాక్యుమెంటరీ గా చెప్పుకోవచ్చు. ఇంత చర్చ జరిగిన ఆ డాక్యుమెంటరీ లో ఏముందో ఒక్కసారి చూద్దాం.
విశ్లేషణ…
గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్. తమాషాగా ఉన్నప్పటికీ వర్మ పెట్టిన టైటిల్ లో దేవుడు, శృంగారం, నిజం… ఈ మూడు కూడా ఒకే ప్రమాణం ఉండదు. ఈ విషయాల మీద ఒక్కోరిది ఒక్కో అభిప్రాయం, ఒక్కోరిది ఒక్కో అనుభూతి, ఒక్కోరిది ఒక్కో కోణం, ఒక్కోరిది ఒక్కో దృక్కోణం, ఒక్కోరిది ఒక్కో రుచి, ఒక్కోరిది ఒక్కో అనుభవం, ఒక్కోరిది ఒక్కో రకం ఆస్వాదన, ఒక్కోరిది ఒక్కో రకం శక్తి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో నమ్మకం, ఒక్కొక్క సంప్రదాయం . ఇవన్నీ తెలిసి కూడా యూనివర్సల్ సబ్జెక్టు అన్న కోణంలో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ని రాము ఎంచుకోడానికి కారణం వుంది. ఎందరు అన్ని రకాలుగా ఆలోచించినా వీటి గురించి ఆలోచిస్తూనే వుంటారు కాబట్టి వర్మ ఈ సబ్జెక్టు ని ఎంచుకోవడం ఒక కారణం అయితే దాన్ని అనుకున్న భావాన్ని వ్యక్తీకరించడానికి మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్ దొరకడం ఇంకో కారణం .
ఒక డాక్యుమెంటరీ గా గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ని చూసినప్పుడు రాము శృంగారాన్ని స్త్రీ దృక్కోణంలో చూపించడానికి ప్రయత్నించాడు. అనంత ప్రకృతి తత్వాన్ని తనలో నిలుపుకున్న స్త్రీ తత్వాన్ని చూపడానికి ట్రై చేసాడు. కానీ స్త్రీ అంటే ఒక్క మియా మాల్కోవా మాత్రమే అనుకోడానికి వీల్లేదు. భిన్న అనుభవాలు, అనుభూతులకు కారణం అయ్యే విషయాన్ని ఒక దృక్కోణంలో ఆలోచించడమే తప్పు. ఇక శృంగారానికి వున్న ప్రాధాన్యం గురించి రాము ఇటు ఆర్టిస్టిక్ గా లేదా సైన్స్ పరంగా కాకుండా తన అభిప్రాయాన్ని మియా నోటితో వినిపించినట్టుంది. అయితే మియా లాంటి పోర్న్ స్టార్ మాములుగా చెబితే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఆమెతో అంగాంగ ప్రదర్శన చేయిస్తూ శృంగార భావనల విషయంలో స్త్రీ కోణాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. అయితే మియా చెప్పిన విషయాలు మన సంస్కృతి ప్రకారం అందరూ వున్నప్పుడు చర్చించుకోడానికి ఇబ్బంది పడేవే తప్ప అసలు మాటాలాడుకోనివి , అనుభవించనివి, అనుభూతి చెందనివి మాత్రం కాదు. అందుకే గాడ్ ,సెక్స్, ట్రూత్ అని వర్మ తీసిన డాక్యుమెంటరీ చూసాక కొత్తగా ఏమీ ఉండదు. కళ్ళ ముందు కనిపించే మియా అందాలు తప్ప.
ఇక ఇలాంటి సినిమాకు నేపధ్య సంగీతం అందించడం చిన్న విషయం కాదు. కానీ కీరవాణి ఈ టెస్ట్ లో 100 పెర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్నాడు. 19 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ లో కీరవాణి సంగీతం మియా అందాలతో పోటీ పడి మరీ పరుగులు తీసింది. వర్మ కంటెంట్ తో పోల్చుకుంటే కీరవాణి సంగీతమే గెలిచింది.
ప్లస్ పాయింట్స్…
మియా అందాలు
శారీరక ఫ్లెక్సిబిలిటీ
మైనస్ పాయింట్స్ ..
వర్మ లో లోపించిన క్లారిటీ.
తెలుగు బులెట్ పంచ్ లైన్… సెక్స్ విషయంలో గాడ్ ని నమ్మడమే వర్మ చెప్పిన ట్రూత్ అనుకోవాలి.
తెలుగు బులెట్ రేటింగ్… 2 / 5 .