రాంగోపాల్ వర్మదే మొదటి సినిమా

రాంగోపాల్ వర్మదే మొదటి సినిమా

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కరోనా వైరస్ చిత్రం విడుదల కి సిద్దం అయినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయం లో పలు చిత్రాలను తెరకెక్కించిన వర్మ, ఓటిటి ద్వారా పలు చిత్రాలను విడుదల చేశారు. అయితే మొదటగా తీసిన కరోనా వైరస్ సైతం ఒటిటి ద్వారా విడుదల అవుతుంది అని అందరూ భావించినా, మొత్తానికి ఈ చిత్రం ధియేటర్లో విడుదల అవుతుంది అని రామ్ గోపాల్ వర్మ స్వయం గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

లాక్ డౌన్ అనంతరం ధియేటర్ లలో విడుదల అయ్యే మొదటి సినిమా కరోనా వైరస్ అంటూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.అక్టోబర్ 15 నుండి థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి అని, ఈ విషయం తనను ఎంతో ఆనందాన్ని కలిగించింది అని తెలిపారు. అయితే ధియేటర్ లలో విడుదల అయ్యే మొదటి సినిమా కరోనా వైరస్ అంటూ రామ్ గోపాల్ వర్మ జత చేయడం గమనార్హం.