సంచలనం సృష్టించిన వర్మ

సంచలనం సృష్టించిన వర్మ

వివాదాస్పద వీరుడు, సంచలనాలకు మారు పేరు రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సొసైటీలో జరిగే పలు విషయంపై వర్మ రియాక్ట్ అయ్యే తీరు వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తుంటుంది. కాంట్రవర్సియల్ సినిమాలు తీయాలన్నా, రాజకీయాల్లో వేలు పెట్టి వివాదాస్పద కామెంట్స్ చేయాలన్నా వర్మ తర్వాతే ఎవరైనా. ఆలాంటి ఆర్జీవీ తాజాగా మరోసారి ఏపీ, తెలంగాణ రాజకీయాలపై తనదైన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయారు.

తన కొత్త సినిమా ‘కొండా’ షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన రామ్ గోపాల్ వర్మ.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ సంచలనం సృష్టించారు. మరోసారి నల్ల బల్లి సుధాకర్ పేరు వాడుతూ అసలు విషయం చెప్పారు. నిజానికి ‘కొండా’ మూవీ అనేది తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన సినిమా. మరి ఆయన ఆంధ్రాలో షూటింగ్ ఎందుకు చేస్తున్నట్లు? పశ్చిమ గోదావరి జిల్లాతో కొండాకు సంబంధం ఏమిటి? ఇది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న. సరిగ్గా ఇదే ప్రశ్నను అక్కడి మీడియా అడిగేసింది.

దీంతో దానిపై రియాక్ట్ అయిన ఆర్జీవీ.. ఇది వరంగల్ బేస్డ్ సబ్జెక్ట్ కానీ అక్కడ నల్ల బల్లి సుధాకర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చాము. సిమిలర్ లొకేషన్ ఇక్కడ దొరకడంతో కొంతభాగం ఇక్కడ షూట్ చేస్తున్నాం అని చెప్పారు. గతంలో రక్త చరిత్ర సినిమా కోసం బొంబాయి వెళ్ళాం ఇప్పుడు కొండా కోసం ఇక్కడికి వచ్చామని అన్నారు.ఇకపోతే ఏపీ టీడీపీ నేత పట్టాభిరామ్ వైసీపీ నేతలు టార్గెట్‌గా చేసిన కామెంట్స్ టీడీపీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ‘బోసిడీకే’ అనే పదం చర్చల్లో నిలిచింది. అయితే దీని అర్థం ఏంటని వర్మను ప్రశ్నించగా.. ఆ పదానికి అర్థం తనకైతే తెలియదని.. దానికోసం డిక్షనరీలు చూసేంత టైమ్ తనకు లేదని చెప్పారు. ఇప్పటికే దీనిపై చాలామంది మాట్లాడేశారు తనతో మాట్లాడించవద్దని ఆయన అన్నారు. కాగా ఏపీ నాయకులు త్వరలోనే బాక్సింగ్, కరాటే నేర్చుకోవాలంటూ ఇటీవల ఆర్జీవీ చేసిన కామెంట్ జనాల్లో చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే.