15 కోట్లు తన అకౌంట్‌కు బదిలీ చేయించుకున్న రియా

15 కోట్లు తన అకౌంట్‌కు బదిలీ చేయించుకున్న రియా

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నుంచి తాను ఎన్నడూ డబ్బు తీసుకోలేదని బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి అన్నారు. తనకు సంబంధించిన ప్రతీ అవసరానికి తన ఆదాయం నుంచే ఖర్చు చేశానని వెల్లడించారు. అయితే సుశాంత్‌ ప్రారంభించిన ఓ కంపెనీలో అతడితో కలిసి తాను, తన సోదరుడు లక్ష రూపాయలు పెట్టుబడి(మూలధనం) పెట్టామని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీకి తాను ఎటువంటి చెల్లింపులు జరుపలేదని పేర్కొన్నారు. అదే విధంగా ముంబైలోని ఖర్‌(ఈస్ట్‌) ఏరియాలో తన పేరు మీద గల ఫ్లాట్‌ కోసం 60 లక్షలు హౌజింగ్‌ లోన్‌ తీసుకున్నానని, మరో 25 లక్షలు తన సొంత ఆదాయం నుంచి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట రియా చక్రవర్తి వాంగ్మూలం నమోదు చేశారు.

కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 8 నుంచి తొమ్మిది గంటల పాటు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.