శృంగార తారగా ఒకప్పుడు మలయాళ సూపర్ స్టార్లనే గడగడలాడించిన షకీల మామూలు మహిళ నుండి ఆమె శృంగార తారగా మారడం వెనుక పెద్ద కథే ఉంది. మలయాళంలో ఈమె సినిమాలు వస్తున్నాయంటే స్టార్ హీరోల సినిమాలే వాయిదా వేసుకునేవారు. హీరోయిన్గా ఎదగాలని ఆశపడిన ఆమె చివరికి శృంగార తారగా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా రానుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన షకీలా.. 20 ఏళ్ల వయస్సులో సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ చిన్న, చితక క్యారెక్టర్లు చేసేవారు. నటిగా గుర్తింపు పొందాలే ప్రయత్నంలో ఆమె పలు పెద్దల చిత్రాల్లో నటించక తప్పలేదు. అది క్రమేణా ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టడంతో అందులోనే కొనసాగారు.
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె తెలుగులో శీలవతి అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. షకీలా జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఆమె జీవితంపై తెరకెక్కుతున్న చిత్రాన్ని మలయాళంలో తెరకెక్కించనట్లు తెలిసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం స్వరభాస్కర్, హ్యుమా ఖరేషీల పేర్లను పరిశీలించారు. చివరికి బాలీవుడ్ శృంగార తార రిచా చద్దాను ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం రిచా ప్రస్తుతం మలయాళం నేర్చుకుంటోంది. అలాగే షకీలాతో మాట్లాడి ఆమె జీవితం గురించి కూడా తెలుసుకుంటోంది. ఆగస్టు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేయనున్నారు.