భారత మహిళలకు అరుదైన గౌరవం

భారత మహిళలకు అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో.. అరిస్టా నెట్‌వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలవగా.. సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. 1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు.

కాన్ఫ్లుయెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్లు, జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా 29, 39వ స్థానాల్లో నిలిచారు. పెప్సికో సంస్థ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్ర నూయి.. 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు.