టాలీవుడ్‍లో చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు

టాలీవుడ్‍లో చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు

పెళ్లి చూపులు సినిమాతో అంత పెద్ద హిట్‍ కొట్టినా కానీ హైద్రాబాదీ అమ్మాయి రీతూ వర్మకి టాలీవుడ్‍లో చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. తనను చిత్ర పరిశ్రమ గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తమిళంలో దుల్కర్‍ సల్మాన్‍తో చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ రీతూ వర్మలోని కొత్త కోణాన్ని చూపించింది. అదే సమయంలో ఆమెకు తెలుగులోను అవకాశాలు పెరిగాయి.

నానితో టక్‍ జగదీష్‍, నాగశౌర్యతో ఒక సినిమా చేస్తోన్న రీతూ వర్మకి ‘కనులు కనులను దోచాయంటే’ సక్సెస్‍తో తమిళం నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. విక్రమ్‍తో ఆమె నటించిన ‘ధృవ నచ్చత్రం’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. పుదమ్‍ పుదుకాలై అనే తమిళ చిత్రం త్వరలో అమెజాన్‍ ప్రైమ్‍లో విడుదల కానుంది. చైనా అనే మరో తమిళ చిత్రం నిర్మాణంలో వుంది.

తాజాగా విజయ్‍ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందే ఒక క్రికెటర్‍ బయోపిక్‍ కోసం రీతూ వర్మను సంప్రదించినట్టు తెలిసింది. పెళ్లిచూపులు తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు ఏమంత వర్క్ లేని రీతూ వర్మ ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీ అయిపోయింది. అందుకే అంటారు… సినీ పరిశ్రమలో సక్సెస్‍ కంటే టైమ్‍ చాలా ఇంపార్టెంట్‍ అని.