తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం

తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం

అమెరికాలోని ఉతాహ్‌ రాష్ట్రంలో ఇసుక తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కానోష్‌ నగరంలోని ఇంటర్‌ స్టేట్‌ హైవే 15 మీద ఈ ప్రమాదం జరిగింది.

ఇసుకు తుఫాను కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో, దాదాపు 22 వాహనాలు ఢీకొట్టుకొని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. దీంతో 8 మంది మరణించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎయిర్‌ అంబులెన్సులను ఉపయోగించారు. ఇసుక తుఫాను, రోడ్డు ప్రమాదం కారణంగా హైవే 15ను ఆదివారం మూసేశారు.