అతివేగంగా దూసుకెళ్లిన వాహనాల రూపంలో చెన్నైలో ఇద్దరు పోలీసులు, చెన్నై శివార్లలో దంపతులు మంగళవారం వేకువజామున విగతజీవులయ్యారు. తిరుప్పూర్‌కు చెందిన కార్తిక్(34), రామనాథపురానికి చెందిన రవీంద్రన్(32) సాయుధబలగాల విభాగంలో పోలీసులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు ఇటీవల ట్రైనింగ్ ముగించుకుని చెన్నై నగర విభాగంలో విధులకు చేరారు.
వీరు కోయంబేడు బస్టెరి్మనల్లో భద్రతా విధుల్లో ఉన్నారు. రవీంద్రన్ ఆవడిలో, కార్తిక్ అన్ననూరులో బస చేశారు. ఈ ఇద్దరు మంగళవారం వేకువజామున ఒకే మోటారు సైకిల్‌పై కోయంబేడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో వెస్ట్ మొగపేర్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రవీంద్రన్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తిక్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.