జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ద్మురణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ లారీ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం ద్విచక్ర వాహనంపై దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మృతులు బెంగుళూరుకు చెందిన వారు. వీరంతా బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.