రోడ్డు పక్క టీస్టాల్పైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని షహనాజ్పూర్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం షహనాజ్పూర్లో ఢిల్లీ-లక్నో హైవేపై వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి అక్కడి మెడికల్ వద్ద ఉన్న టీస్టాల్పైకి దూసుకెళ్లింది. దీంతో టీస్టాల్లోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
బస్సులో ఉన్న వారితో కలిపి మొత్తం ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.మృతులను సురేష్కుమార్, అధార్ అలి, వేద్ పాల్గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అలి గర్భిణి అయిన తన భార్యను ఆసుపత్రిలో చేర్పించడానికి రాగా.. వేద్పాల్ అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శింటానికి వచ్చాడు. ఇద్దరూ అనుకోని ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.