మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మాదాపూర్‌లోని 100 ఫీట్‌ రోడ్డులో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లైన్‌ క్రాస్‌ చేసి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనకు సంబంధిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగానే కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుడి వివరాలు తెలియరాలేదు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.