మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలోని రహదారిపై ఉన్న టోల్బూత్లోకి ఒక ట్రక్కు దూసుకురావడంతో 20 మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. టోల్బూత్ వద్ద ఆపి ఉంచిన వాహనాలపైకి ఓ రవాణా ట్రక్కు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవ దహనమయ్యారు.
ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలోని చాల్కో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ కూడా మంటల్లో చిక్కుకుని మృతిచెందాడు. నవంబర్ 1వ తేదీ నుంచి చూస్తే సెంట్రల్ మెక్సికోలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవర పరుస్తున్నాయి.