జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.14 మంది తీవ్ర గాయాలపాలవ్వగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.మృతులంతా దేవరకొండ మండలం చింతబావికి చెందిన వారుగా తెలుస్తుంది.
రోజువారీ పనుల్లో భాగంగా 20 మంది కూలీ లు పిఏపల్లి మండలం రంగారెడ్డి గూడెం లో నాట్లు వేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లెక్కకు మించి ప్రయాణికులు ఆటోలో ఉండటం,ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో లారీ డీ కొట్టింది. ఆటో డ్రైవర్ తో పాటు 5 గురు మహిళలు మృతి చెందారు.
ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతి చెందినవారి కుటుంబసభ్యుల రోధనలతో ప్రమాదస్థలంలో రోధనలు మిన్నంటాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.